కమ్యూనిస్టు దేశం క్యూబాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది.
హోల్గున్‌కు చేరుకోవాల్సిన విమానం బోయ్‌రోస్, శాంటియాగో డీ లావెగాస్ గ్రామాల మధ్య పొలాల్లో కుప్పకూలింది.
ఈ బోయింగ్ 737 విమానంలో 104 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు.
ప్రమాదం గురించి తెలియగానే క్యూబా అధ్యక్షుడు మిగ్యుఎల్ డియాజ్ కానెల్ సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఎంతమంది చనిపోయిందీ అధికారికంగా ప్రకటించకపోయినా చాలామంది ప్రాణాలు కోల్పోయారని కానెల్ సంతాపం వ్యక్తం చేశారు.
చాలామందిని అంబులెన్సుల్లో తీసుకెళ్లడం చూశామని సంఘటన స్థలం వద్ద ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
No comments:
Post a Comment