Thursday, 5 July 2018

మహిళా చట్టాలు : శిక్షలు, జరిమానాలు


1. 148- ఎ అదనపు కట్నం కోసం వేధిస్తే - మూడు సంవత్సరాలు జైలు శిక్ష-జరిమానా.
2. 497- ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష-జరిమానా.
3. 312 - గర్భిణీ అనుమతి లేకుండా భర్త, అత్తమామలు అబార్షన్‌ చేయిస్తే ఏడు సంవత్సరాలు జైలుశిక్ష-జరిమానా.
4. 313 - భార్య ప్రమేయం లేకుండా ఒత్తిడితో అబార్షన్‌ చేయిస్తే పది సంవత్సరాలు శిక్ష-జరిమానా
5. 363- బాలికను కిడ్నాప్‌ చేస్తే - ఏడు సంవత్సరాల శిక్ష-జరిమానా.
6. 366-ఎ-18సంవత్సరాలలోపు అమ్మాయిని బెదిరించి పనులు చేయించుకుంటే, వ్యభిచారానికి బలవంతంగా దింపితే-10సంవత్సరాల శిక్ష-జరిమానా.
7. 366 -బి -21సంవత్సరాలలోపు అమ్మాయిలను ఇతర దేశాలకు వ్యభీచారం కోసం పంపిస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష-జరిమానా.
8.372 - అడపిల్లలను అమ్మితే-పది సంవత్సరాలు జైలు శిక్ష- జరిమానా.
9. 373- బాలికలను కొనుగోలు చేసి వ్యభీచారం చేయిస్తే పది సంవత్సరాల జైలు శిక్ష- జరి మానా.
10.376 - రేప్‌ కేసులో ఏడు సంవత్సరాల శిక్షతోపాటు-జరిమానా, ఒక్కో సారి జీవితకాలం శిక్ష కూడా పడవచ్చు.
11. 326-ఎ యాసిడ్‌ దాడులలో మహిళలను గాయపర్చితే పది సంవత్సరాల శిక్షతో పాటు-జరిమానా ఒక్కో సారి జీవిత కాలం శిక్ష కూడా విధిం చవచ్చు.
12. 326-బి యాసిడ్‌ పోయడానికి ప్రయత్నం చేస్తే ఐదు సం వత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు శిక్ష, జరిమానా.
13. 354-మహిళల పట్ల అస భ్యంగా ప్రవర్తిస్తే ఒక్క సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరి మానా.
14. 354-ఎ బెదిరించి మహిళలను లైంగికంగా ఒత్తిడి చేస్తే మూడు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా.
15. 354బి బలవంతంగా మహిళల హక్కులను హరిస్తే మూడు నుంచి ఏడు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా.
16. 354 సి- ఒంటరిగా ఉన్న మహిళలను బెదిరించడం, ఫొటోలు తీయడం చేస్తే ఒకటి నుంచి మూడు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా.
17. 2013 చట్టం ప్రకారం పని ప్రదేశాలలో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తే కేసు తీవ్రతను బట్టి శిక్ష.
18. 2005- 43వ చట్టం ప్రకారం గృహ హింస నిరోధక చట్టం ప్రకా రం తీవ్రతను బట్టి శిక్ష.
19. 2012 చట్టం ప్రకారం ఆడ పిల్లలను బలవంతంగా వ్యబిచారానికి దింపితే ఏడు నుంచి జీవత కాలం శిక్ష.
20. 494 ప్రకారం రెండో పెళ్లి చేసుకుంటే ఏడు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా.
21. 125 సిఆర్‌పిసి ప్రకారం మనోవర్తి.
22. 2005 చట్టం ప్రకారం మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కు

No comments:

Post a Comment