Wednesday, 19 September 2018

ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతుర్ని కడతేర్చిన కసాయి తండ్రి

Watch video

పిల్లల ప్రేమలను పెద్దలు జీర్ణించుకోవడం లేదు. పెద్దల దుర్మర్గాలను కూడా పిల్లలు పసిగట్టడం లేదు. ఫలితం.. రోడ్లపై నరికివేతలు..! మిర్యాలగూడ ప్రణయ్ కులహత్య ఘాతుకాన్ని మరవరక ముందే హైదరాబాద్‌లో అలాంటి దారుణం జరిగింది. అమ్మాయి కులాంతర వివాహం చేసుకుందన్న తండ్రి ఆమెను దారుణంగా నరికాడు. హైదరాబాద్ ఎర్రగడ్డలో ఈ రోజు మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. ఎర్రగడ్డకు చెందిన ఎస్సీ యువకుడు బల్ల నవదీప్(24), బోరబండకు విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మాధవి(22) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మాధవి తండ్రికి ఇది నచ్చలేదు. మేనమామకు ఇచ్చి పెళ్లి చేయాలకున్నాడు. దీంతో మాధవి  నాలుగు రోజుల కిందట నవదీప్‌ను వివాహం చేసుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మాధవి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. దీంతో మాధవి తండ్రి మరింత రగిలిపోయాడు. తమకు ప్రాణాలకు హాని ఉందని నవదీప్, మాధవి మీడియాకు కూడా చెప్పారు. టీవీల్లో వారి మాటలు విన్న మాధవి తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. అమ్మాయి తండ్రి ఈరోజు పథకం ప్రకారం హత్యకు యత్నించాడు.  కూతురిని, అల్లుడిని మాట్లాడుకుందారం రమ్మని ఎర్రగడ్డలోని ఓ షోరూం వద్దకు పిలిపించాడు. నవదీప్, మాధవి స్కూటర్‌పై అక్కడి చేరుకున్నారు. మాధవి తండ్రి బైక్ పై వచ్చాడు. రావడంతో కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. సందీప్ కిందపడిపోయాడు. మాధవిని కింద పడేసి చేయి, తలపై నరికేశాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై కుప్పకూలిపోయింది. ఓ వ్యక్తి.. ఆ దుండగుణ్ని అడ్డుకోవడానికి యత్నించాడు. మాధవిని మొదట సనత్ నగర్లోని నీలిమ ఆస్పత్రికి, తర్వాత సోమాజిగూడ ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

No comments:

Post a Comment