Saturday, 20 October 2018

22 తర్వాత కోస్తాలో భారీ వర్షాలు

22 తర్వాత కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరిక

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

నేడు, రేపటితో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ

అనంతరం ఈశాన్య రుతుపవనాల ప్రవేశం

ఈ నెల 22 తర్వాత కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 22,23 తేదీల నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అనంతరం అది వాయుగుండంగా మారుతుందని, తద్వారా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలో రాష్ట్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడుతోందని,

అయితే సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఉందని వివరించారు.

నేడు, రేపటితో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు వెళ్లిపోతాయని,

అనంతరం ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వివరించారు

No comments:

Post a Comment