Monday, 7 May 2018

లింగంపల్లి-కాకినాడ టౌన్‌, లింగంపల్లి-విశాఖపట్నం మధ్య మొత్తం 30 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని లింగంపల్లి-కాకినాడ టౌన్‌, లింగంపల్లి-విశాఖపట్నం మధ్య మొత్తం 30 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు.

లింగంపల్లి-కాకినాడ టౌన్‌ స్పెషల్‌(రైల్‌ నెంబర్‌: 07075) లింగంపల్లి నుంచి మే 13, 20, 27, జూన్‌ 3, 10, 17, 24 తేదీల్లో(ఆదివారం) ఉదయం 4.55గంటలకు బయల్దేరి, సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా (5.35గంటలకు) మరుసటి రోజు సాయంత్రం 4.45గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో.... కాకినాడ టౌన్‌-లింగంపల్లి స్పెషల్‌(రైల్‌ నెంబర్‌: 07076) కాకినాడ టౌన్‌ నుంచి మే 13, 20, 27, జూన్‌ 3, 10, 17, 24 తేదీల్లో (ఆదివారం) రాత్రి 7గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.45గంటలకు సికింద్రాబాద్‌, 7.45గంటలకు లింగంపల్లి చేరుతుంది. 

లింగంపల్లి-విశాఖపట్నం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07148) లింగంపల్లి నుంచి మే 11. 18, 25, జూన్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో(శుక్రవారం) సాయంత్రం 5గంటలకు బయల్దేరి, సికింద్రాబాద్‌ స్టేషన్‌(సాయంత్రం 5.50గంటలకు) మీదుగా మరుసటిరోజు ఉదయం 8గంటలకు విశాఖపట్నం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-లింగంపల్లి స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07147) విశాఖపట్నం నుంచి మే 12, 19, 26, జూన్‌ 2, 9, 16, 23, 30వ తేదీల్లో(శనివారం) ఉదయం 10.15గం.. బయల్దేరి అదే రోజు రాత్రి 10.30గంటలకు సికింద్రాబాద్‌, లింగంపల్లికి 11.10గంటలకు చేరుతుంది.

No comments:

Post a Comment