న్యూఢిల్లీ :
రాబోయే 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడొచ్చునని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వాతావరణశాఖ రాష్ట్రాలను హెచ్చరించింది.
జమ్మూకశ్మీర్, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, నాగాల్యాండ్, మిజోరం, త్రిపుర, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షంతోపాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశముందని అధికారులు చెప్పారు.
చండీఘడ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశమున్నందున ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు కోరారు.
భారీ గాలి, వర్షాల వల్ల పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది.
భారీ వర్సాల వల్ల యూపీలోని ఘజియాబాద్, మీరట్ నగరాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలో పిడుగులు పడిన ఘటనతో పాఠశాలలకు రెండురోజులపాటు సెలవు ప్రకటించారు.
No comments:
Post a Comment