Monday, 7 May 2018

18న ఎంసెట్‌ ఫలితాలు!

హైదరాబాద్‌ : తొలిసారి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష సోమవారంతో విజయవంతంగా ముగిసింది. ఎంసెట్‌ ప్రాథమిక 'కీ'ని మంగళవారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ యాదయ్య తెలిపారు. ప్రాథమిక 'కీ' www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. 'కీ' పై అభ్యంతరాలుంటే ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక ఎంసెట్‌ ఫలితాలను ఈ నెల 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఎంసెట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులకు వారి జవాబు ఓఎంఆర్‌ పత్రాలను మెయిల్‌ ఐడీకి పంపించనున్నారు. కాగా, ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు 8 షిఫ్టులలో నిర్వహించిన ఎంసెట్‌కు మొత్తం 2,20,990 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 2,03,168 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిసారి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతం కావడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన వారికి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, కన్వీనర్‌ యాదయ్య కృతజ్ఞతలు తెలిపారు. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగానికి 66,857 మంది, ఇంజనీరింగ్‌ విభాగానికి 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు.

No comments:

Post a Comment