Sunday, 20 May 2018

బీహార్ ముఠా అనే అనుమానంతో నలుగురికి స్థానికులు దేహశుద్ది చేశారు

విశాఖపట్నం కంచరపాలెం న్యూస్, మే 20 :-
పిల్లలను ఎత్తుకెళ్ళి బీహార్ ముఠా అనుమానంతో నలుగురు వ్యక్తులకు స్థానికులు దేహశుద్ధి చేసి కంచరపాలెం పోలీసు లకు అప్పగించారు .
ఇందుకు సంబందించి  పశ్చిమ జోన్ ఎసిపి లంక అర్జున్ వివరాలు వెల్లడించారు . రెడ్డి కంచరపాలెం వద్ద ఆదివారం మద్యాహ్నం అనుమాన స్పంద స్థితిగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను బీహార్ ముఠా అనే అనుమానంతో స్థానికులు దేహశుద్ది చేసి పోలీసు లకు అప్పగించారన్నారు . ఇందులో ఉత్తర ప్రదేశ్ మహావీర్ గార్డెన్స్ కు చెందిన జాకీర్ మాలిక్ 35 పెందుర్తి వేపగుంట గంగిరెడ్డి కోలని కి చెందిన బంగారమ్మ , మరో వ్యక్తిని మహిలను స్ధానికులు దేహశుద్ది చెయడంతో అందులో ముగ్గురి కి తీవ్ర గాయాలయ్యాయని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు .
ఈఘటనలో స్థానికులకు చిక్కిన మరో మహిళ బంగారమ్మ ను విచారిస్తున్నామని తెలిపారు .

పుకారులను నమ్మోదు
పశ్చిమ జోన్ ఎసిపి లంక అర్జున్ , కొంత మంది అకతాయిలు సోషల్ మీడియాలో  చేస్తున్న  తప్పుడు ప్రచారాలు నమ్మోదని ఎసిపి లంక అర్జున్ విజ్ఞప్తి చేశారు .  ఈమేరకు మిడియా సమవేశం ఏర్పాటు చేసిన  ఆయన మాట్లడుతూ .  ఇంటువంటి పుకారుల వలన రహదారులపై మతిస్థిమితం లేని వారు బిక్షాటన చేస్తున్నవారు  స్థానికుల చేతుల్లో దెబ్బలు తింటున్నారని అన్నారు . ఇప్పటికి ఇంటువంటి అపోహలు నమ్మోద్దని ఎడిసిపి విలేకర్ల సమవేశంలో తెలిపారన్నారు .
గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు తెలిస్తే తక్షణం స్థానిక పోలీసు లకు సమచారం అందించాలని కోరారు . ఇకపై గ్రామాల్లో పోలీస్ గస్తి తీవ్రతరం చేస్తామని రహదారులపై అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తామని అన్నారు .
సమవేశంలో కంచరపాలెం సి.ఐ చంద్రశేఖర్ , ఎయిర్ పోర్ట్ సి.ఐ మళ్ల శేషు తదితరులు ఉన్నారు .

No comments:

Post a Comment