భారత రైల్వే శాఖ స్మార్ట్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది.
వాటిలో బ్లాక్ బాక్స్‌లను ఏర్పాటు చేయడంతోపాటు, కోచ్‌ల సమాచారం, ప్రమాదానికి కారణాలు తెలుసుకొనే వ్యవస్థను కంపార్ట్‌మెంట్లలో ప్రవేశపెట్టనుంది.
బ్లాక్ బాక్స్‌లు సాధారణంగా విమానాల్లో, హెలికాఫ్టర్‌లో ఉంటాయి.
ఇప్పుడు వాటిని రైల్వేల్లోకి మొదటిసారి తీసుకురానున్నారు.
కోచ్ కండిషన్, ప్రయాణికులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ సదుపాయాలతో ఉన్న స్మార్ట్ కోచ్‌ను జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా పైలట్ ప్రాజెక్టు కింద రాయ్‌బరేలీలో మే 11న ప్రారంభించనున్నారు.
ఈ ఏర్పాట్ల ద్వారా రైలు పట్టాలు తప్పడం, ఆలస్యానికి కారణాలు, మౌలిక సదుపాయాల్లో ఉండే సమస్యలు గుర్తించడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు.
ప్రయాణికుల కోచ్‌లలో వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించడానికి సెన్సర్ బేస్డ్ ఆన్ బోర్డు మానిటరింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
దీని ద్వారా కోచ్‌లో వెంటిలేషన్, ఏసీ, నీరు అందుబాటు, ఉష్ణోగ్రత స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ప్రయాణికుల భద్రతను పరిశీలించడానికి అవకాశం ఏర్పడుతుంది.
ముందుగానే సమస్యలను గుర్తించడం ద్వారా ప్రమాదాలను తగ్గించడంతో పాటు రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అయ్యే అవకాశం ఉంటే దాని బట్టి రైల్వేశాఖ ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ సదుపాయాలు అందుబాటులోకి తేవడం వల్ల ఓ కోచ్‌కు అదనంగా రూ.15లక్షలు నుంచి రూ.20లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది.
No comments:
Post a Comment