Tuesday, 29 May 2018

భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురందించింది. ఎట్టకేలకు భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ ఆమోద ముద్ర వేశారు. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ భూసేకరణ చట్ట సవరణ బిల్లును 2013 చట్ట సవరణ ప్రకారం ఆ బిల్లులో ఉన్న నిబంధనల ప్రకారం ఏపీ కూడా చట్ట సవరణ చేసింది. గతంలో తెలంగాణ కూడా అదే విధంగా గుజరాత్‌కు సంబంధించిన భేసేకరణ చట్టసవరణ బిల్లు ఏ విధంగా ఉందో... అందులో ఉన్న అంశాలనే పొందుపరడంతో కేంద్రం ఆమోదం తెలిపింది. కొత్త చట్ట సవరణ బిల్లువల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను కూడా సేకరించే అవకాశం ఉంది.

No comments:

Post a Comment