దాదాపు రెండు వారాల విరామం తరువాత పాపికొండలు విహారయాత్రకు వెళ్లేందుకు అధికారులు పచ్చజెండా ఊపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన లాంచీలను, బోట్లను ముమ్మరంగా తనిఖీ చేసిన అనంతరం ఆరు లాంచీల్లో యాత్రికులను తరలించేందుకు అంగీకరిస్తూ తాత్కాలిక అనుమతులిచ్చారు. ఈ నెల 15న జరిగిన లాంచీ ప్రమాదంలో 19 మంది మృత్యువాతతో అప్రమత్తమైన యంత్రాంగం లాంచీలు, బోట్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ మేరకు మంగళవారం రెండు లాంచీల్లో యాత్రికులు వెళ్లారు. ఉభయగోదావరి జిల్లాల్లో 73 బోట్లతోపాటు ‘ఫెర్రీ’ల్లో లాంచీలు నిలిచిపోయాయి. పాపికొండల పర్యాటకం కంటే దేవీపట్నం-సింగనపల్లి, పురుషోత్తపట్నం-పోలవరం, గూటాల-వంగలపూడి ఫెర్రీలు నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఎట్టకేలకుఫెర్రీ రేవులతోపాటు పాపికొండలుకు ఆరు బోట్లు వెళ్లేలా మంగళవారం పోర్టు అధికారులు అనుమతులు ఇచ్చారు.
73 లాంచీలు, ఆరు పంట్లు పరిశీలన
సింగనపల్లి రేవులో 18 బోట్లు, ఆరులాంచీలను తనీఖీ చేయగా అనేక లోపాలు బయటపడ్డాయి. కాలుతో లాంచీల రేకులను తన్నితే కన్నాలు పడే పరిస్థితులను అధికారులు చూశారు. 15 సంవత్సరాల కాలపరిమతి దాటిన ఎనిమిది బోట్లను తనిఖీ చేసిన అధికారులు పలు లోపాలను గుర్తించారు. మరో 16 బోట్లలో లైఫ్ జాకెట్లు లేవన్నారు. 2017 ఐవీ యాక్టు ప్రకారం లాంచీలకు ఉపయోగించే రేకు 8 ఎం.ఎం. నుంచి 10 ఎం.ఎం. మందం ఉండాలి. ప్రస్తుతం ఉన్న బోట్లలో నాలిగింటికే ఆ ప్రమాణాలున్నాయి. ఫెర్రీ రేవులకు వచ్చే సరికి ప్రయాణికులను తగ్గించి ఎక్కించుకోవడం, ద్విచక్రవాహనాలను తగ్గించడం, బరువు వస్తువులు వేయకూడదనే నిబంధనలు విధించారు.
"పక్కాగా తనిఖీలు ,పోర్టు, మత్స్యశాఖ, అగ్నిమాపకశాఖ సంయుక్తంగా అన్ని లాంచీలు, బోట్లు, ఫెర్రీలను తనిఖీ చేశాం. సామర్థ్యం ఉన్న వాటికే అనుమతులిచ్చాం.
" అని తెలియజేసారు లరత్నరాజ్, డీఈ, జలవనరులశాఖ, ధవళేశ్వరం
No comments:
Post a Comment