మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీ నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని రూ. లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు మంగళవారం మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. మాదాపూర్‌లో పోర్డ్‌ల్యాబ్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ పేరిట సతీష్ అనే వ్యక్తి గత డిసెంబర్‌లో ఐటీ కంపెనీ ప్రారంభించాడు. నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒకోక్కరి వద్ద నుంచి సుమారు రూ.1 లక్ష నుంచి రూ. రెండు లక్ష ల వరకు వసూలు చేశారు. సుమారు 150 మందికి కంపెనీలో మూడునెల ల పాటు శిక్షణ ఇచ్చి, వారికి నామమాత్రం జీతాలు చెల్లించాడు. మూడు నెలల తర్వాత జీతాలు ఇవ్వకపోవగా, అడిగితే అసభ్యంగా ప్రవర్తిస్తు, వేరే కంపెనీల్లో కూడా ఉద్యోగాలు రాకుండా చేస్తామని బెదిరించాడు. దీంతో బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులు మంగళవారం ఠాణా ముందు బైఠాయించారు. అయితే, పోలీసులు సరైన సమాధానం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
Most read
-
Sustainable agriculture is a new hope to India agriculture sector. Farmers in India shifting of sowing pattern frequently suiting to the cl...
-
Paytm has been witnessing a shift in consumer behavior as an increasing number of customers are choosing to save in Paytm Gold as opposed to...
No comments:
Post a Comment