Wednesday, 9 May 2018

జులైలో పంచాయతీ ఎన్నికల

ఆగస్టు 1తో సర్పంచుల పదవీ కాలం ముగుస్తుందని, ఆ గడువులోపే తదుపరి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఈనెల 15 నంచి పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించాలని అందులో సూచించారు.

జూన్‌ 25 నాటికి వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించాలని, జులైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రమేష్‌కుమార్‌ సూచించారు.

No comments:

Post a Comment